BEL: బెల్లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 16 d ago
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ముంబయి యూనిట్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-28, డిప్లొమా అప్రెంటిస్-15, ఐటీఐ అప్రెంటిస్-30 మొత్తం 72 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీరింగ్ అభ్యర్ధులకు 17,500/-, బీఎస్సీ/బీకామ్/బీఏ/డిప్లొమా అప్రెంటిస్ అభ్యర్ధులకు రూ. 12,500/- స్టైఫండ్ ఇస్తారు. ఐటీఐ అప్రెంటిస్ లకు ట్రేడ్లను బట్టి రూ. 10,560 నుంచి రూ. 11, 040 వరకు స్టైఫండ్ ఇస్తారు. విద్యార్హత సంబంధిత కోర్సులను జులై 1, 2021 తర్వాత పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. వయసు పోస్టును అనుసరించి 25 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నింబంధనల మేరకు వయోపరిమితి సడలింపు ఉంటంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఫిబ్రవరి 27. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.